Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవీంద్ర రెడ్డి, వినరు ప్రాణి గ్రహి, త్రినాథ్ వర్మ హీరోలుగా, స్వాతి మందాడి, భావన సాగి హీరోయిన్లుగా రూపొందిన సినిమా 'ధ్వని'.
సాయి సాధన నన్నపనేని, సాన పరమకష్ణ నిర్మాణ సారథ్యంలో నాగ దుర్గారావు సానా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతున్న సందర్భంగా సక్సెస్‌మీట్‌లో దర్శకుడు దుర్గారావు సానా మాట్లాడుతూ, 'మా సినిమాను ఇంతటి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు ధన్యవాదాలు. నిర్మాతలు పరమకష్ణ, సాధన నన్నపనేని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు' అని తెలిపారు.
'మా సినిమా విడుదలై మంచి టాక్‌తో ముందుకు వెళుతోంది. సినిమాకు ఉన్న మంచి రెస్పాన్స్ కారణంగా స్క్రీన్స్ పెంచాం. సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన పెద్ద సపోర్ట్ ఇది. ఈ సక్సెస్ మా కష్టాన్ని మరిచిపోయేలా చేసింది' అని హీరో రవీంద్ర రెడ్డి అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'సినిమా చూశాను కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయవచ్చు. అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది' అని చెప్పారు.
'మా సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా సినిమా మరోమారు నిరూపించింది. ఈ సినిమాను ఎవ్వరూ మిస్ కావద్దు. తప్పకుండా థియేటర్స్‌లో మా సినిమాను చూసి ఆదరించండి' అని త్రినాధ్ వర్మ తెలిపారు.