Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శర పంజరం'.
టి. గణపతి రెడ్డి, మల్లిక్ ఎంవికె నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను, ఫస్ట్గ్లిమ్స్ను సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రత్యేక వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మొదటి పాటను విడుదల చేయగా, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్‌ను రిలీజ్ చేేశారు. మామిడాల హరికష్ణ, ఉడుగుల వేణు నాలుగు నిమిషాల డి.సి.పిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'కాలం మారినా ఇంకా కొన్ని చోట్ల జోగిని లాంటి దూరాచారాలు మారకుండా కొనసాగుతున్నాయి. వాటిని రూపు మాపే క్రమంలో దర్శక, నిర్మాతలు ఇలాంటి సామాజిక సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడం అభినందనీయం' అని చెప్పారు. దర్శకుడు నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నా 12 సంవత్సరాల కల. ఈ కథకు మూలం మా తాత. గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది?, ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత చూపించారు అనే దాన్ని పల్లెటూరు నేపథ్యంలో చూపిస్తున్నాం' అని అన్నారు. 'నటీనటులు చాలా చక్కగా నటించారు. ఇందులో ఒక సాంగ్‌ని మించి మరొక సాంగ్ ఉంటుంది. జబర్దస్త్ టీం అంతా చాలా బాగా నవ్విస్తారు. జోగిని వంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని నిర్మాతలు మల్లిక్, గణపతి రెడ్డి తెలిపారు.