Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో నాయిక నజ్రియా ఫహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'రంగో..రంగా..' అంటూ సాగే మూడవ పాటని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'సినిమా కథ చెప్పడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయది ప్రత్యేకమైన శైలి. కథ చెప్పడంలోనే కాదు ఆయనకి మంచి సంగీతాభిరుచి కూడా ఉంది. ఆయన సినిమాల్లోని పాటలు డిఫరెంట్‌గా ఉంటూ ఒక్కో పాట డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌కి కనెక్ట్ అవుతుంది. వివేక్ సాగర్ స్వరపరిచిన 'అంటే.. సుందరానికీ' ఫస్ట్ సింగిల్ 'పంచెకట్టు', సెకెండ్ సింగిల్ 'ఎంత చిత్రం...' పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రం నుండి రిలీజైన మూడవ సింగిల్ 'రంగో రంగా' కథలో సుందరం పాత్ర పరిస్థితిని హిలేరియస్‌గా ప్రజెంట్ చేసింది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ పాటని చాలా డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు 'అనుకున్నదోటి .. అయ్యిందోటి రంగో రంగా.. మొక్కిందోటి.. దక్కిందోటి రంగో రంగా.. నీకుంది నిక్కచ్చి పిచ్చి కాలంకి నీపైన కచ్చి..' అంటూ అందించిన సాహిత్యం క్యాచీగా ఉండటంతో అందరికీ బాగా రీచ్ అవుతోంది. పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం, నాని ఎక్స్ప్రెషన్స్ హిలేరియస్‌గా ఉన్నాయి. కారుణ్య ఈ పాటను చాలా ఎనర్జిటిక్‌గా ఆలపించారు. అలాగే సెట్స్‌లో జరిగిన సరదా విజువల్స్‌ను ఈ పాటలో చూపించడంతో ప్రేక్షకుల బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి రెండు పాటల్లానే ఈ పాట కూడా ఇన్స్టంట్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశాం. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి మా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.