Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎఫ్ 2' సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలను ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. 'ఎఫ్ 3' నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఎఫ్ 2'కి ట్రిపుల్ డోస్ వినోదం 'ఎఫ్ 3'లో ఉంటుంది' అని కథానాయకుడు వెంకటేష్ అన్నారు.
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో
రూపొందిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మొదటి సినిమాగా భావిస్తా
నా ప్రతీ సినిమాని మొదటి సినిమాగానే భావిస్తా. ప్రతీ సినిమాకి అలానే కష్టపడతా. నా స్టార్ డమ్, ఇమేజ్‌ని ఎప్పుడూ క్యారీ చేయను. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్లు చేసినప్పుడు ఇలాంటి ఇమేజ్‌ని క్యారీ చేయకూడదు. అప్పుడే నేచురల్ ఫ్లో బయటికి వస్తుంది. 'ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు', 'అబ్బాయిగారు', 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'.. ఇలా ఎన్నో చిత్రాలు ఎలాంటి ఇమేజ్ లెక్కలు వేయకుండా చేసినవే. సినిమా చేసినప్పుడు ఎక్కువ అలోచించను. సినిమాని, నా పాత్రని ఎంజారు చేస్తాను.
ఆనందంగా ఉంది
'నారప్ప', 'దశ్యం' రెండూ సీరియస్ సినిమాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. 'ఎఫ్ 3'తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్‌ని కలవడం ఆనందంగా ఉంది. నేను సహజంగానే అందరితోనూ సరదాగా ఉంటా. నన్ను ఇలా చూడటానికి ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడతారు. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ఎంటర్టైనర్లు చూడటంలో ఓ కిక్ ఉంటుంది.
అప్పటికీ మారకపోతే..
త్వరగా డబ్బులు సంపాదించాలనుకోవడం, పెద్ద కలలు కనడం, దీని కోసం అవకాశాలు సష్టించటం మానవుని సహజ లక్షణం. అందరికీ డబ్బుపై ఆశ ఉంటుంది. అయితే ఈ క్రమంలో బోలెడు సమస్యలు ఎదురౌతాయి. అలాగే ఎన్నో పాఠాలూ నేర్చుకుంటాం. ఆ పాఠాలతో మారుతాం. ఒకవేళ మారకపోతే మళ్ళీ అవే సమస్యల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ పాయింట్‌తో చేసిన సినిమా ఇది. దీన్ని ఎంటర్టైనింగ్ వేలో స్క్రీన్ మీద చూపించాం.
అనిల్ కామెడీ టైమింగ్ సూపర్
అనిల్ రావిపూడి చాలా సింపుల్ పర్సన్. నటీనటుల దగ్గర్నుంచి ది బెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అలాగే అద్భుతంగా డైలాగ్స్ రాస్తాడు. ఆయన డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి. అలాగే చాలా ఎనర్జిటిక్. అనిల్‌లో కామెడీ టైమింగ్ సూపర్‌గా ఉంటుంది. ఆయనకి ఏం కావాలో క్లారిటీ ఉంది. నా రియల్ లైఫ్‌కి పూర్తిగా ఉండే క్యారెక్టర్ని అనిల్ ఈ సినిమాలో నాతో చేయించాడు (నవ్వుతూ).
వరుణ్‌తో వండల్ఫుల్ జర్నీ
'ఎఫ్ 2' లో వరుణ్ తేజ్, నా కాంబినేషన్‌ని ప్రేక్షకులు చాలా బాగా ఎంజారు చేశారు. ఇందులో వరుణ్ పాత్ర ఇంకా బాగుంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్‌తో వండర్ ఫుల్ జర్నీ. అలాగే దిల్రాజుగారితోనూ జర్నీ అద్భుతంగా ఉంటుంది.
సరైన టీమ్ దొరికితే చేస్తా
సరైన టీమ్ కుదిరితే పాన్ ఇండియా సినిమాలు తప్పకుండా చేస్తా. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కోసం కెరీర్లో మొదటిసారి చాలా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నా. ఇక రియాలిటీ షోస్‌కి హోస్ట్ చేయమని చాలా మంది సంప్రదిస్తున్నారు. ఈ షోస్ చేయడంలో నాకు చిన్న ఇబ్బంది ఉంది. చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటే రెండు మూడుసార్లు తర్వాత నాకు ఏదో తెలియని బ్లాక్ వచ్చేస్తుంది (నవ్వుతూ). మా అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇప్పటికైతే వాడ్ని హీరోగా పరిచయం చేసే ఆలోచనలు లేవు. నాన్నగారి (రామానాయుడు) బయోపిక్‌లో నటిస్తా. రీసెంట్గా వివేకానంద కథ అనుకున్నాను. అది కుదరలేదు. ఏదైనా స్క్రిప్ట్ కుదరాలి. ప్రస్తుతం సితార, మైత్రీ మూవీ మేకర్స్‌లో చేస్తున్నాను.