Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కె.జి.ఎఫ్-1', 'కె.జి.ఎఫ్-2' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్టించిన కథానాయకుడు యష్. ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం 'లక్కీ'. కన్నడనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రం 'లక్కీ స్టార్‌గా తెలుగులో విడుదల కానుంది.
కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకువస్తున్నారు.
రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన అగ్ర నాయిక రమ్య నటించింది. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ' ట్రైలర్ చాలా బాగుంది. 'కేజీఎఫ్' బ్లాక్‌బస్టర్ తర్వాత యష్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. దీంతో ఈ సినిమాపై కూడా అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలి. ఈ సినిమాతో తెలుగులోనూ నిర్మాత రవిరాజ్గారికి గ్రాండ్ సక్సెస్ ఎంట్రీ లభిస్తుందని నమ్ముతున్నాను' అని తెలిపారు.
నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ, 'తెలుగులోనూ స్ట్రయిట్ సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకే ఈ చిత్రానికి చాలా మంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినప్పటికీ, మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడి, మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, 'రాబర్ట్' ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు' అని చెప్పారు.
ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: కేశవ్ గౌడ్, కూర్పు: దీపు ఎస్. కుమార్, ఛాయాగ్రహణం: కష్ణ, సంగీతం: అర్జున్ జన్య (రాబర్ట్ ఫేమ్), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డాక్టర్ సూరి.