Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో రమణ ఫిలిమ్స్ పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం 'ముసలోడికి దసరా పండుగ'. నాజర్ ప్రధాన పాత్రలో నటించగా, అంజలి, 'నువ్వునేను' ఫేమ్ అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. డి.మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర పోస్టర్, ట్రైలర్‌ను ఇటీవల నాజర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ, 'ఇందులో నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ట్రైలర్ బాగుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
నిర్మాత రమణవాళ్లె మాట్లాడుతూ, 'ప్రేక్షకుడు రెండు గంటల సేపు అన్నీ మరచిపోయి హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. మా దర్శకుడు మనోహర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో సినిమా రిలీజ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్నాను' అని అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం:హనుమాయన్, బండారు, మాటలు: ఎం.వెంకట్, సంగీతం:డి.ఇమాన్, ఎడిటింగ్: బి.మధు, కెమెరా :వి.లక్షీపతి, నత్యం: కళ్యాణ్, దినేష్, దర్శకత్వం: డి. మనోహర్.