Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం '11:11'. గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా ఈ సినిమాను నిర్మాత గాజుల వీరేష్ (బళ్ళారి) నిర్మిస్తున్నారు. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్.కె.నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోీ ఈ చిత్రంలోని 'ఏమయ్యిందో మనసైపోయే మాయం...' అంటూ యూత్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్న యూత్ ఫుల్ సాంగ్‌ను హీరో రామ్ విడుదల చేసి, సాంగ్ చాలా బాగుందంటూ మేకర్స్‌ని అభినందించారు.
ఈ పాటలో హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశాలతో పాటు కోటి అందించిన మ్యూజిక్ మేజర్ హైలైట్‌గా నిలిచింది. తన ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లు ఈపాటను రాకేందు మౌళి రాశారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే చిరంజీవిగారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, దగ్గుబాటి రానా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుని, సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. హీరో రాజీవ్ సాలూర్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, ఈ ట్రాక్‌లోకి అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం వంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. అతి త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. రోహిత్, కోటి సాలూర్, సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఈశ్వర్, ఎడిటర్: రవి మాన్ల, డైలాగ్స్: పవన్ కె అచల, మ్యూజిక్ : మణిశర్మ, ప్రొడ్యూసర్: గాజుల వీరేష్ (బళ్ళారి), లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గాలి, స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: ఆర్.కె.నల్లూరి.