Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ తొలిసారి నటించిన పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.
- 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన శ్రీచరణ్ పాకాల బుధవారం మీడియాతో మాట్లాడారు.
అడవి శేష్‌తో నా జర్నీ చాలా క్రేజీగా అనిపిస్తుంది. 'కిస్', 'కర్ణ' సినిమాలకు పనిచేశాను. తర్వాత 'క్షణం' చేశాను. అప్పటి నుంచి 'గూఢచారి', 'ఎవరు'తోపాటు ఈ సినిమాకి మ్యూజిక్ అందించాను.
- దర్శకుడు శశికిరణ్ నాకు కథ చెప్పగానే చాలా ఎగ్జైట్‌మెంట్ వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం అనగానే అప్పటో జరిగిన సంఘటనలు, ఆయన ఫొటో నా కళ్ళముందు కనిపించింది. అలాంటి సినిమాకు పనిచేయడం గర్వంగానూ ఉంది.
- ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇదొక బయోపిక్ అయినప్పటికీ ఇందులో డ్రామా ఉంది. యాక్షన్, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్, లవ్‌స్టోరీతోపాటు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాకి హైలైట్‌గా నిలిచే ఇవన్నీ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా యూత్‌కి. ఈ సినిమాని తప్పకుండా యూత్ చూడాలి.
- 1990 నాటి కథ కాబట్టి నేను అప్పటి సంగీతం బాగా రావడానికి కషి చేశాను. నా కెరీర్ తొలినాళ్ళలోనే బయోపిక్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇప్పటికే ఇందులోని పాటల్ని ప్రేక్షకులు ఆదరించి హిట్ చేశారు. రమేష్, కష్ణకాంత్, రాజీవ్ భరద్వాజ రాసిన పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది.
నేను ఇప్పటి వరకు థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించాను. 'క్షణం' తర్వాత 'గరుఢవేగ', 'గూఢచారి', 'ఎవరు', 'డీజే టిల్లు' సినిమాలు అలా చేసినవే. మాస్, కామెడీ సినిమాలకూ పని చేయాలని ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న 'ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం', 'క్షణం' దర్శకుడితో 'గూఢచారి2', 'తెలిసిన వాళ్ళు', 'ఎవరు' అనే కన్నడ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నాను.