Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, ఎస్.కె. ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జైత్ర'. సన్నీ నవీన్, రోహిణి రేచల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సురేష్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాతలు.
చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్‌ల్యాబ్‌లో గురువారం ఘనంగా జరిగింది. దర్శకుడు వెంకీ కుడుముల టీజర్, 'జైత్ర' పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా దగ్గర పని చేసిన మల్లి దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా టీజర్‌కు గెస్ట్‌గా రావడం గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత చాలా తపనతో మంచి సినిమా తీశారు' అని తెలిపారు. 'రాయలసీమలో జోడెద్దులు, నాలుగు ఎకరాలున్న భాగ్యవంతుడి కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది' అని దర్శకుడు తోట మల్లికార్జున చెప్పారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'నేను చేసిన 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా' సినిమాలు మంచి కంటెంట్ ఉన్నాయి. అలాగే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఆరు పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్ వారు మొదటినుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. 'రంగస్థలం', 'పుష్ప' రేంజ్ సినిమా అవుతుందనే నమ్మకముంది' అని అన్నారు. 'దర్శకుడు మల్లి చెప్పిన కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. రాయలసీమ యాసతో సాగే మట్టిమనుషుల కథ' అని మరో నిర్మాత అల్లం సుభాష్ చెప్పారు.