Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇటివలే విడుదలై, సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.
జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్లో అలరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400కి పైగా థియేటర్లలో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రేష్ఠ్ మూవీస్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌రెడ్డి చెన్నైలో కమల్‌హాసన్‌ని కలిసి 'విక్రమ్' తెలుగు పోస్టర్‌ను అందించారు. అలాగే తెలుగులో ప్రమోషన్ స్ట్రాటజీ గురించి చర్చించారు. కమల్‌హాసన్‌తో పాటు చిత్ర యూనిట్‌తో తెలుగునాట గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. 'కమల్‌హాసన్‌గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'విక్రమ్' చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయటం గర్వంగా ఉంది. బ్లాక్‌బస్టర్ సినిమాగా ఇది ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది' అని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం: లోకేష్ కనగరాజ్, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, సంగీతం : అనిరుధ్ రవిచందర్.