Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు భాషల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న రాగిణి ద్వివేది నటిస్తున్న కొత్త చిత్రం 'సారీ'. దీనికి కర్మ రిటర్న్స్ అనేది ఉప శీర్షిక. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మ దరకత్వం వహిస్తున్నారు. కె.వి.ఎం.డి ప్రొడక్షన్స్, కిస్ ఇంటర్నేషనల్స్ పతాకాలపై. నిర్మాత నవీన్ కుమార్ (కెనడా) నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కథానాయిక రాగిణి ద్వివేది మాట్లాడుతూ, 'సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. మునుపెన్నడూ పోషించని సూపర్ హీరో వంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయటం ఆనందంగా ఉంది. నన్ను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. సూపర్ హీరో చిత్రమనగానే ఫైట్స్ కచ్చితంగా ఉంటాయి. వాటిని నేనెంతో బాగా చేస్తున్నాను. టెక్నికల్‌గా ఈ చిత్రానికి పెద్ద పీట వేశాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది' అని చెప్పారు. 'మూడు భాషల్లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రమిది. ఇందులో సూపర్ హీరోగా రాగిణి విశ్వరూపం చూడబోతున్నారు' అని దర్శకుడు బ్రహ్మ అన్నారు. 'ఈ చిత్రానికి సంబంధించిన మూడవ షెడ్యూల్‌ను జూన్‌లో హైదరాబాద్‌లో చేయబోతున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. మా బ్యానర్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్‌హిట్ సినిమాని కచ్చితంగా చెప్పగలం' అని సహ నిర్మాత జై కపాలిని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజీవ్ గణేశన్, సంగీతం: రాజు ఎమ్మిగనూరు, రచన: బోయనపల్లి రమణ, ఎడిటింగ్: నందమూరి హరి, కొరియోగ్రఫీ: ఇమ్రాన్ సర్ధారియా, ఫైట్స్ : అల్టిమేట్ శివ, ఫయాజ్ ఖాన్.