Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబి నేషన్‌లో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్‌హాసన్‌తో పాటు విజరు సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో రూపొందింది.
జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాలో మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్‌లో అలరించ బోతున్నారు. ఈ చిత్ర మ్యూజికల్ ప్రొమోషన్స్‌లో భాగంగా 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే తొలి సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
'అనిరుధ్ రవిచందర్ ఈ పాటని మంచి మాస్ సాంగ్‌గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్‌తో డ్యాన్సింగ్ నెంబర్‌గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్‌లో కమల్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా ఉంది. ఈ పాటలో కమల్‌హాసన్ డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. చంద్రబోస్ అందించిన సాహిత్యం అందరినీ అలరిస్తోంది. కమల్ హాసన్ హీరోగానే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400కి పైగా థియేటర్లలో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది' అని చిత్ర బృందం తెలిపింది.
కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: లోకేష్ కనగరాజ్, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, రిలీజ్ : శ్రేష్ట్ మూవీస్, సంగీతం : అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్.