Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం విదితమే. లేటెస్ట్‌గా టికెట్ ధరల వివరాలను చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. 'తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర రూ.150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.147, మల్టీప్లెక్స్‌ల్లో రూ.195, 177. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశ్యంతోనే టికెట్ ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా చేశాం. మా నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో ఉండటం వల్ల రిపీట్ ఆడియెన్స్ కూడా వస్తారని ఆశిస్తున్నాం. అలాగే థియేట్రికల్ రిలీజ్‌కి ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్‌లను నిర్వహిస్తున్నాం' అని మేకర్స్ తెలిపారు.
మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించిన ఈ చిత్రం జూన్3న ప్రేక్షకుల ముందుకు రానుంది.