Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా 'ఎఫ్ 3'ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు.. యూనివర్సల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి మా సినిమాని ఎంజారు చేయడం హ్యాపీగా ఉంది' అని 'ఎఫ్3' చిత్ర బృందం తెలిపింది.
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్ర మిది. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలై యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్‌తో ప్రభంజనం సష్టించింది. ఈ సందర్భంగా హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ''ఎఫ్ 3'కి యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. మా సినిమాని చూసిన ప్రేక్షకులు సూపర్... ఎక్స్ ట్రార్డినరీ.. అదిరి పోయిందిగా..అంటున్నారు. అన్ని చోట్లా ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్‌ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం సంతోషంగా ఉంది' అని చెప్పారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ''ఎఫ్ 3'తో మరో బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి 'సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎఫ్ 2', ఇప్పుడు 'ఎఫ్ 3'తో హ్యాట్రిక్ విజయం సాధించాం. అలాగే వరుణ్ తేజ్‌తో 'ఫిదా', 'ఎఫ్ 2', లేటెస్ట్గా 'ఎఫ్ 3'తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు.. అమెరికా, లండన్ నుంచి రాయలసీమ, కోస్తా, నైజాం ఇలా యునివర్షల్గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు' అని అన్నారు.
'ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు. 'ఎఫ్ 2' కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. 'ఎఫ్ 3' రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు గారు, శిరీష్ గారితో ఇది నాకు ఐదో సినిమా. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ ఉండి కూడా కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఒక్కొక్క ఎపిసోడ్‌ని ప్రేక్షకులు సూపర్‌గా ఎంజారు చేస్తున్నారు. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్యామిలీ అంతా కలిసి థియేటర్లకు వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి' అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.
పాండమిక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. యూత్, మాస్ మాత్రమే థియేటర్లకి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేమంతా కలసి ఫ్యామిలీస్‌ని కూడా థియేటర్లకి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం 'ఎఫ్ 3'తో నెరవేరినందుకు ఆనందంగా ఉంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఈ సినిమాని ఎంజారు చేస్తున్నారు.
'ఎఫ్ 2' తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి సీన్ ఎంజారు చేస్తున్నారు. అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి మా సినిమాని హ్యాపీగా నవ్వుకోవాలని ఆశిస్తున్నాను. దిల్‌రాజు, శిరీష్‌తో మా సక్సెస్ఫుల్ జర్నీ ఇలాగే కొనసాగాలి.
- వెంకటేష్