Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్.. నటుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. శనివారం ఆయన శత జయంతి సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ కష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ గారు తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తి. నాయకుడిగా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. వారి విగ్రహాన్ని ఆవిష్కరిచటంతో నా జన్మ ధన్యమైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. ఫిలిం నగర్లో ఎన్టీఆర్ మార్గ్ పేరు వచ్చేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి కషి చేస్తాను' అని తెలిపారు.
'ఎన్టీఆర్ మనతోనే ఉన్నారు, ఉంటారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరే త్రిమూర్తులు స్వరూపం. వారి మనస్తత్వం పై నేనో పుస్తకాన్ని రచించనున్నాను. వారితో నేను చేసిన 16 ఏళ్ల ప్రయాణం, చెప్పిన జీవిత సత్యాలతో ఈ పుస్తకం ఉంటుంది. మమల్ని రచయితలుగా ఎన్టీఆర్ పోత్సహించారు. పరుచూరి బ్రదర్స్ అని ఆయనే మాకు పేరు పెట్టారు' అని పరుచూరి గోపాలకష్ణ చెప్పారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,'ఎన్టీఆర్‌కి మాగంటి గోపీనాథ్, పరుచూరి గోపాలకష్ణ సన్నిహితులు. ఎన్టీఆర్ గారిని కలిసే అదష్టం నాకు కొన్నిసార్లు లభించింది. ఫిలింనగర్లో రోడ్డుకే కాదు ఫిలింనగర్కే ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'ఎన్టీఆర్ గారి వల్లే ఫిలిం నగర్ డెవలప్ అయింది. లోకల్ టాలెంట్‌ను ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు మూలకర్త ఎన్టీఆర్. నటుడిగా, నాయకుడుగా ఆయన తన మార్క్ చూపించారు' అని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ,'నందమూరి మోహనకష్ణ, ప్రసన్న కుమార్ వల్లే ఫిలింనగర్లో ఈ విగ్రహం ఏర్పాటైంది. ఎన్టీఆర్ నాటి తరానికే కాదు నేటి తరానికి కూడా మార్గదర్శి. ఆయనది స్ఫూర్తిదాయక ప్రయాణం' అని చెప్పారు. ఇదే వేడుకలో సీనియర్ పాత్రికేయుడు భగీరథ రచించిన 'మహానటుడు- ప్రజా నాయకుడు ఎన్టీఆర్' పుస్తక ఆవిష్కరణ జరిగింది.