Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహంకాళి మూవీస్ బ్యానర్ పై జిబి కష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం 'బ్లాక్'.
ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, హిట్ టాక్ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన హీరో ఆది సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ, 'మంచి కంటెంట్‌ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ చేశారు. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. అలాగే థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. నిజంగా మేం అనుకున్నట్లుగా సినిమా ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టింది. మా సినిమాని బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని తెలిపారు.
'మా సినిమాని ప్రేక్షకులు మెచ్చి మంచి విజయాన్ని అందించారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను' అని నిర్మాత మహంకాళి దివాకర్ చెప్పారు.
డైరెక్టర్ జిబి కష్ణ మాట్లాడుతూ, 'నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి, హీరో ఆది సాయి కుమార్ గారికి ధన్యవాదాలు. మార్నింగ్ షో అవ్వగానే నా ఫ్రెండ్స్, ఫిల్మ్ ఇండిస్టీలోని పెద్దలు అందరూ సినిమా చాలా బాగుందంటూ మెచ్చుకుంటున్నారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.
'ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ అరుదుగా వస్తాయి. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఇందలోని నా పాత్ర అందర్నీ మెప్పించింది' అని కౌశల్ చెప్పారు.