Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్షిత్ శెట్టి నటించిన మరో విభిన్న కథా చిత్రం '777 ఛార్లి'. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వV్‌ా బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ''నటుడిగా ఈ సినిమా నాకు కష్టతరమైన చిత్రమనే చెప్పాలి. ఇందులో ధర్మ అనే పాత్రలో నటించాను. చాలా అంతర్ముఖుడిగా కనిపించే పాత్ర. నా జీవితంలోకి ఓ కుక్క రావటం మూలంగా ఎలాంటి మార్పులు జరిగిందనేది ఈ సినిమా.తెలుగులో ఈ సినిమాను అందిస్తున్న రానాకి థ్యాంక్స్' అని చెప్పారు.
'ఈ సినిమా చూసిన వెంటనే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను' అని హీరో రానా అన్నారు.