Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్‌బికె 107 అనే వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
శనివారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని, ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ చిత్రం నుండి సరికొత్త మాస్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 'టెంపుల్ బ్యాక్‌్‌డ్రాప్‌లో బాలయ్య కత్తి పట్టుకుని ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. గతంలో చూడని మాస్ లుక్, డిఫరెంట్ పాత్రలో బాలకృష్ణని దర్శకుడు గోపీచంద్ చూపించ బోతున్నారు. సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తారు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అంచనాలని రెట్టింపు చేస్తే, తాజాగా విడుదలైన ఈ మాస్ పోస్టర్‌తో సినిమాలో ఏ స్థాయిలో హై ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందో సూచించింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కన్నడ స్టార్ దునియా విజరు ఈ సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా' అని చిత్ర బృందం తెలిపింది.