Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కంగ్రాట్స్ 'మేజర్'లాంటి చాలా మంచి సినిమా చేశారని గ్రీటింగ్స్ చెప్పడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్న పర్యటనలో అందరూ ఇదే మాట చెబుతున్నారు' అని కథానాయకుడు అడివిశేష్ చెప్పారు.
అడివి శేష్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.
హీరో అడివి శేష్ ప్రమోషన్‌లో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ,' '26/11 సంఘటనలు జరిగాక ఆయన ఫొటోలు బయటకు వచ్చాయి. నాకూ సందీప్‌కు పోలికలు ఉన్నాయని మా కజిన్ పవన్ చెప్పాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయనకు అశోక్ చక్ర వచ్చినప్పుడు ఆయన గురించి చదివి, ఆయనకు ఫ్యాన్ అయ్యాను. ఆయన నిజజీవితంలో జరిగిన విషయాలు ఎవరికీ తెలియవు. హోటల్‌లో 36 గంటలు ఏం చేశాడనేది తెలుసు. కానీ 31 ఏండ్లలో ఆయన జీవితం ఎలా ఉందనేది ఎవరికీ తెలీదు. ఇవన్నీ నేను తెలుసుకున్నాక ఆయన లైఫ్ గురించి ఎందుకు చెప్పకూడదనే ఆలోచన వచ్చింది. డేరింగ్‌గా ఈ సినిమా తీశామంటే మహేష్‌బాబే కారణం. ప్రీ రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌కు సినిమా చూపించి, ప్రీ రిలీజ్ చేయడం అనేది గొప్ప విషయం. అంత ఓపెన్‌గా ఉండి జనాల రియాక్షన్ నుంచి నిర్ణయం తీసుకున్నాం. అది కేవలం మహేష్‌బాబుగారి ఎంకరేజ్ మెంట్ వల్లే సాధ్యమైంది. దర్శకుడు శశికిరణ్ అద్భుతంగా తీశాడు. శ్రీచరణ్ పాకాల మంచి సంగీతం ఇచ్చారు. ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి మా టీమ్ అందరిలోనూ ఉంది. ఈ సినిమా మేజర్ సందీప్‌కి మేమిచ్చే ఘన నివాళిగా భావిస్తున్నాం' అని చెప్పారు.