Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'కే3 కోటికొక్కడు'. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విశేష ప్రేక్షకాదరణ పొంది రూ.60 కోట్లకి పైగా వసూళ్ళు సాధించింది.
సుదీప్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు ఉండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు తాజాగా జూన్ 17న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
'మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మరో మూడు పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ స్పెషల్‌గా ప్లాన్స్ చేస్తున్నారు. కన్నడలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలోని కిచ్చా సుదీప్ నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్దా దాస్, రవి శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: శివ కార్తీక్, సమర్పణ : స్పందన పాసం, శ్వేతన్ రెడ్డి, నిర్మాతలు : శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే, మాటలు : కె. రాజేష్ వర్మ, సంగీతం: అర్జున్ జెన్యా, డీఓపీ : శేఖర్ చంద్రు, ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోని.