Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబినేషన్లో విడుదలైన సినిమా 'ఎఫ్3'. ఈనెల 27న విడుదలైన ఈ సినిమా డబుల్ హ్యాట్రిక్ సాధించింది. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ వేడుకను హైదరాబాద్ దస్పల్లా హోటల్లో సోమవారం చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, 'నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ మా సినిమా నచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ సక్సెస్‌ని నేను మాటల్లో చెప్పలేను. ఈ సినిమా షూటింగ్ జరిగిన 100 రోజుల్లోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. రియల్ టీమ్ వర్క్ ఇది. 'ఎఫ్2' తర్వాత 'ఎఫ్3' చేశారంటే ప్రతి ఒక్కరూ స్వంత సినిమాగా భావించి చేశారు. ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. నా అభిమానులు థియేటర్లో నన్ను చూసి మూడేళ్ళయింది. నా సినిమా చూసి మనస్పూర్తిగా అభినందిస్తున్న ఇండిస్టీలోని వారికి థ్యాంక్స్. సినిమా చాలా చాలా బాగుందంటూ నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి' అని తెలిపారు.
''ఎఫ్3' సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. సహజంగా యాక్షన్, మైథలాజికల్ సినిమాలను ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ కోవలోనే 'ఎఫ్3' సినిమాని కూడా సక్సెస్ చేశారు. పిల్లలు కూడా సినిమా చూసి డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా తీసి అందరికీ ఫ్రస్టేషన్ లేకుండా చేసిన దర్శకుడు అనిల్‌గారికి థ్యాంక్స్. మా 'ఎఫ్3' కుటుంబ సభ్యలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు' అని వరుణ్‌తేజ్ చెప్పారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'నా 45 ఏళ్ళ సినీ జీవితంలో నాకు నచ్చిందే చెప్పాను. 'ఎఫ్3' సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాకపోతే మొహం చూపించనని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వచ్చాను. ఇప్పుడు నిజమైన సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఈ సినిమాను రెండు నమ్ముకుని తీశాం. ఒకటి నవ్వు. రెండు ప్రేక్షకులు నమ్ముకుని తీశాం. నాకు నా 'మాయలోడు' సినిమా గుర్తుకు వచ్చింది. మనకు పండుగ రోజుల్లో పాత సినిమాలను టీవీల్లో వేస్తుంటారు. 'గుండమ్మకథ', 'అప్పుచేసి పప్పుకూడు' వంటి చిత్రాలు నవ్వులు పూయిస్తుంటాయి. అలా ఈ సినిమా కూడా నవ్వులు పూయించింది' అని చెప్పారు.
నాకిది 6వ సినిమా. రిలీజ్ రోజు ఉదయమే ఒక ఫోన్ కాల్ వస్తే బ్లాక్ బస్టర్. అది కూడా వి.వి. వినాయక్‌గారు చేస్తారు. ఈ సినిమాతో కలిపి ఆయన ఆరోసారి చేశారు. నా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈనెల 27న విడుదలై నేటికీ కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ వీక్ కూడా ఎగ్జిబిటర్లకు, కొన్న పంపిణీదారులకు కలెక్షన్లతో నవ్వులు పూయించాలని కోరుకుంటున్నా. థియేటర్లకు ఫ్యామిలీస్‌తో వచ్చి తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు అండగా నిలబడిన దిల్‌రాజు, శిరీష్‌కు కృతజ్ఞతలు.
- దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.