Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ '9 అవర్స్'. తారకరత్న, అజరు, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ జూన్ 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ, 'ఇదొక వండరఫుల్ వెబ్ సిరీస్. ఒక రోజులో 9 గంటల్లో ఏం జరిగింది అనేది ఎపిసోడ్ వైజ్ చూపిస్తున్నాం. ఇందులోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి పాత్రలో ఒక భావోద్వేగం కనిపిస్తుంది' అని తెలిపారు. 'ఇందులో నేను చిత్ర అనే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాను. ఈ కథ 80 దశాబ్దం నేపథ్యంలో సాగుతుంది. పీరియాడిక్ కథలో నటించడం కొత్త అనుభవాన్ని ఇచ్చింది. క్రిష్‌గారితో పనిచేయాలనే కోరిక ఈ వెబ్ సిరీస్‌తో తీరినందుకు హ్యాపీగా ఉంది. ఈ కథను ఆయన ఎంతో సహజంగా రాశారు' అని మధు షాలినీ తెలిపారు.