Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఒకడు'.
సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లాంచ్ వేడుక ఫిలించాంబర్‌లో జరిగింది. ఆధ్యాత్మిక గురు, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసనంద స్వామి బ్యానర్ లోగోను ఆవిష్కరిచాంరు.
దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్, వ్యాపారవేత్త ఎస్వీఆర్ నాయుడు టీజర్‌ను విడుదల చేయగా, సుమన్, ఆధ్యాత్మిక గురు యద్దనపూడి దైవాదీనం, పిట్ల మనోహర్ ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, 'సినిమా ఎంతో బాగా వచ్చింది. ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. కుప్పిలి శ్రీనివాస్ సినిమాను ఎక్కడా కంప్రమైస్ కాకుండా తీశారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాను' అని చెప్పారు. 'నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడం ఎంతో అదష్టం. ఈ సినిమాను చాలా ఇష్టంగా, మంచి టెక్నిషియన్స్‌తో చేశాను. ప్రేక్షకుల దీవెనలు మా సినిమాపై ఉండాలని ఆశిస్తున్నాను. మా ఊరు సర్పంచ్ ఎస్వీఆర్ నాయుడు సపోర్ట్ మాటల్లో వర్ణించలేనిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది' అని హీరో కుప్పిలి శ్రీనివాస్ చెప్పారు.