Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్
పాన్ ఇండియా స్టార్‌గా ఫ్యాన్స్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్న హీరో యష్.
'కేజీఎఫ్', 'కేజీఎఫ్2'తో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఆయన నటించిన ఓ కన్నడ చిత్రం 'రారాజు'గా తెలుగులో విడుదల కానుంది.
కన్నడలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాత వి.ఎస్. సుబ్బారావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గారు గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. నాకు బాగా కావాల్సిన వ్యకి. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్లోకి వస్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాకి ముందు యష్ నటించిన సినిమాని తెలుగులో 'రారాజు' పేరుతో జూన్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కన్నడలో ఇప్పటికే ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. అలాగే తెలుగులోనూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. మరిన్ని మంచి సినిమాలు పద్మావతి పిక్చర్స్ బ్యానర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'మా పద్మావతి పిక్చర్స్ బ్యానర్లో కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన 'రారాజు' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్‌లో రిలీజ్ చేస్తున్నాం. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చాలా బాగుందని అభినందించిన అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ గారికి కతజ్ఞతలు. యష్, ఆయన భార్య రాధిక పండిట్ ఇద్దరూ కలిసిన నటించిన ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయిన మాదిరిగానే తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాత వి.ఎస్.సుబ్బారావు చెప్పారు.
కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : హరికష్ణ, డీ ఓ పి : ఆండ్రూ, డైరెక్టర్ :మహేష్ రావు.