Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గంలో'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రని నితిన్ పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
'నేడు (మంగళవారం) ఈ సినిమా నుండి 'చిల్ మారో.. చిల్ మారో' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తున్నారు. యూనివర్సల్ కథా నాయకుడు కమల్‌హాసన్ ఈ పాటను లాంచ్ చేస్తున్నారు. నేడు హైదరాబాద్‌లో జరగబోయే 'విక్రమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీన్ని కమల్ రిలీజ్ చేయనున్నారు. 'విక్రమ్' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 400కి పైగా థియేటర్లలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి భారీగా రిలీజ్ చేస్తున్నారు. 'చిల్ మారో..' సాంగ్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ రూపొందించిన పోస్టర్లో కార్నివాల్ స్టైలిష్ పోజ్‌తో నితిన్ సూపర్‌గా ఉన్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నితిన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. నితిన్ క్యారెక్టర్‌తోపాటు ఆయన బాడీ లాంగ్వేజ్‌ని సైతం దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి సరికొత్తగా డిజైన్ చేశారు. రాజకీయ అంశాలతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పల్నాటి రాజకీయాలకు వెండితెర రూపంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నితిన్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా నిలువనుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎం.ఎస్.రాజ శేఖర్ రెడ్డి, నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, రాజ్‌కుమార్ ఆకెళ్ల , సంగీతం: మహతి స్వర సాగర్, డీఓపీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంభాషణలు: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు.