Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రారు, నాగార్జున వంటి భారీ తారాగణం నటించిన పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్రం'. (హిందీలో బ్రహ్మాస్త్ర).
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన చిత్రాన్ని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళితో కలిసి రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విశాఖపట్నానికి వచ్చారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, 'దర్శకుడు అయాన్ నాకు కథ చెప్పిన విధానం కంటే, ఆయన సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్న ఎగ్జైట్మెంట్కి నేను చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఆ తరువాత తను తయారు చేసుకున్న విజువల్స్, తన అప్పటివరకు చిత్రీకరణ చేసిన మెటీరియల్ అంతా చూపిస్తుంటే, సినిమా ఇండిస్టీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలనే తపనతో ఈ సినిమా చేశాడు. ఈ సినిమా చూసిన మా నాన్నగారు అయాన్ బ్లాక్ బస్టర్ సినిమా తీశాడని మెచ్చుకున్నారు. ఈ సినిమా ఓ అద్భుతం' అని చెప్పారు.
'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. నా రెండో సినిమా 'యే జవానీ హై దీవానీ' 9 ఏళ్ళ క్రితం ఇదే రోజున రిలీజైంది. ఇక ఈ సినిమా కోసం పదేళ్లు తీసుకున్నాను. నేను చాలా పెద్దగా ఊహించాను.. మునుపెన్నడూ తీయని ఒక గొప్ప సినిమాని తీయాలని. అప్పటికి రాజమౌళి సర్ ఇంకా 'బాహుబలి' కూడా చెయ్యలేదు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యదార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ 'బ్రహ్మస్త్రం'' అని దర్శకుడు అయాన్ ముఖర్జీ చెప్పారు.
'ఓ గొప్ప సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈనెల 15న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నాం. అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నారు.