Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్‌ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చారు. 72 మంది టీమ్‌తో 342 గంటల్లో ఈ సినిమా చిత్రీకరణని పూర్తి చేశారని మేకర్స్ వెల్లడించారు. అలాగే సింగిల్ లొకేషన్లో చిత్రీకరణ చేయటం ఓ విశేషమైతే, తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ ఇదే కావడం మరో విశేషం.
'ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక బందం పని చేస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ త్రిపుర, డీవోపీ: యశ్వంత్ సి, ఎడిటర్: గ్యారీ బీ హెచ్, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, చిత్రా సుబ్రమణ్యం, వంశీ బండారు, లైన్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ. డి.