Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీజే సన్నీ కథానాయకుడిగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అన్‌స్టాపబుల్'. నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్ అనేది ట్యాగ్‌లైన్.
ఎ2బి ఇండియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రంజిత్ రావ్.బి నిర్మాతగా షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహ నిర్మాతలుగా ఈ హాస్య ప్రధాన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. హీరో వీజే సన్నీపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లాప్ నివ్వగా, దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా హీరో సన్నీ మాట్లాడుతూ,'ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను 100% కష్టపడి పని చేస్తాను. ఈ సినిమాకి త్రిమూర్తులు వంటి నిర్మాతలతో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటీనటులతో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రకథను దర్శకుడు డైమండ్ రత్నబాబు అద్భుతంగా తయారు చేశారు' అని తెలిపారు. ''అన్‌స్టాపబుల్' అనే టైటిల్ బాలయ్య బాబుది. ఆయన టైటిల్‌తో వస్తున్న మాకు బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను.. ఈ సినిమా కోసం 200 మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేశాం. నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9 నుండి రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ చేస్తాం. జూన్, జూలై నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి, దసరాకి మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని దర్శకుడు డైమండ్ రత్నబాబు అన్నారు. చిత్ర సహ నిర్మాత రఫీ మాట్లాడుతూ, 'రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకి మంచి హీరో కావాలను కున్నప్పుడు సన్నీని సెలెక్ట్ చేసుకున్నాం' అని చెప్పారు. 'మా బ్యానర్లో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజారు చేసేలా తీసుకువస్తామని హామీ ఇస్తున్నాను. ఈ సినిమా కథ కూడా చాలా బాగుంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందీ చిత్రం' అని నిర్మాత రంజన్ రావ్.బి తెలిపారు.