Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడు, నిర్మాత, నటుడు డా. లయన్ సాయివెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'జయహో రామానుజ'. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత వడ్లపట్ల మోహన్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ ప్రసన్న కుమార్, టిఎఫ్‌సిసి ప్రెసిడెంట్ కొల్లి రామకష్ణ, సెన్సార్ బోర్డు మెంబర్ అట్లూరి రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు, నటుడు సాయి వెంకట్ మాట్లాడుతూ,'11వ శతాబ్దంలో భగవత్ రామానుజుల జీవిత చరిత్ర ఆధారంగా హైదరాబాద్, శ్రీరంగం, బెంగళూరు ప్రాంతంలో షూటింగ్ జరిపాం. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈనెల 15 నుంచి మూడవ షెడ్యూల్‌ను బెంగళూర్, తిరుపతిలో రామానుజులు, మహారాజుల సన్నివేశాలు, తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్ఠతపై సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా నిర్మిస్తున్నాం. మొదటి పార్ట్‌ను దసరాకు రిలీజ్ చేసి, రెండవ పార్ట్‌ను వచ్చే ఏడాది మే 5న రామానుజ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
సాయి ప్రసన్న, ప్రవళ్ళిక నిర్మాతలుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ లయన్ సాయి వెంకట్ రామానుజ చార్యులుగా, జో శర్మ( మిస్ అమెరికా) హీరోయిన్గా, సుమన్, ప్రవళ్ళిక, మనోజ్ కుమార్, అప్పం పద్మ, ఆశ్వాపురం వెణుమాధవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.