Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కమల్ చేసిన 'దశావతారం' వంటి సాహసాన్ని మరే నటుడు చేయలేడు. 'ఏక్ దూజే కేలియే' సినిమాతో ఆయన అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన ఇప్పుడు గ్లోబర్ స్టార్' అని కథానాయకుడు వెంకటేష్ చెప్పారు.
కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. విజరు సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఈనెల 3న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం రాత్రి శిల్పకళావేదికలో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 'యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. కమల్లో శతావతారాలు కనపడతాయి. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది' అని చెప్పారు.
'దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్ గారి 'శ్రీమంతుడు' సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్ వచ్చాను. తెలుగులో నాకు ప్రేక్షకులు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. డైరెక్టర్ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్డీ. నేను, వెంకీగారు 'మర్మయోగి' సినిమా చేయాల్సింది. ఆ సినిమా చేసి ఉంటే మా కెరీర్లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. 'విక్రమ్' సినిమాకు మంచి టీమ్ కుదిరింది. సుధాకర్ రెడ్డిగారు 'విక్రమ్' ఫ్యామిలీ అయినందుకు చాలా ఆనందంగా ఉంది' అని కమల్‌హాసన్ అన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ, 'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాని కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పారు. హీరో నితిన్ మాట్లాడుతూ, 'కమల్‌హాసన్‌గారు ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఆయన రేర్ పీస్. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు.