Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోహెల్, మృణాళిని రవి జంటగా రూపొందుతున్న చిత్రం 'ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు'. కల్పన చిత్ర బ్యానర్‌పై కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బేగంపేట్‌లోని రమడా మనోహర్ హౌటల్లో జరుగుతోంది. బుధవారం దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్బంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ, 'ఈ చిత్ర కథ నచ్చి ఎస్.వి. కష్ణారెడ్డిగారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత కల్పనగారు ఎంతో ప్రోత్సస్తున్నారు' అని చెప్పారు. 'ఎస్.వి.కష్ణారెడ్డిగారికి ఈ సినిమా గొప్ప మలుపు కావాలని కోరుకుంటున్నాను' అని నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. ఎస్.వి.కష్ణారెడ్డి మాట్లాడుతూ, 'మనిషికి అదష్టం వరించాలి. నాకు అచ్చిరెడ్డిగారి లాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. నన్ను దిశానిర్దేశం చేసింది ఆయనే. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా ప్రతిక్షణం నా భవిష్యత్ గురించే ఆలోచిస్తారు. నిర్మాత కల్పనగారు నా కథ విని నాన్‌స్టాప్‌గా నవ్వారు. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారు. వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటాను' అని తెలిపారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో నా టాలెంట్‌ను దర్శకుడు కృష్ణారెడ్డిగారు బయటపెడుతున్నారు. చిన్న సీన్ కూడా చేసి మరీ చూపిస్తున్నారు. అలా కొంతమంది దర్శకులే వుంటారు. సూపర్ డూపర్ మూవీలో చేస్తున్నా. లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది' అని అన్నారు.
'ఈ సినిమా నాకు రావడం లక్కీగా భావిస్తున్నా. లెజండరీ దర్శకుడుతో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని నాయిక మణాళిని రవి
నిర్మాత కల్పన మాట్లాడుతూ, 'మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి సహకారం అందిస్తున్నారు' అని తెలిపారు. డా. రాజేంద్రప్రసాద్, మీనా, అలీ, సునీల్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.