Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 3న విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.
ఈ సందర్భంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా అడవి శేష్ కారణంగానే మొదలైంది. 'మేజర్' తన డ్రీమ్ ప్రాజెక్ట్. దీంతో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి బాగా స్టడీ చేశాను. 'గూఢచారి' అనేది ఫిక్షన్ అది ఎలాగైనా చేయవచ్చు. 'మేజర్'కు మాత్రం పరిమితులు ఉంటాయి. 31 ఏళ్ల మేజర్ జర్నీ, ఆయన చుట్టు పక్కలవారి జర్నీ కూడా చూపించాలి. 26/11 ఎటాక్‌లో ఎంతోమందిని కాపాడిన వ్యక్తి. ఎంతో నాలెడ్జ్ ఉన్న పర్సన్.అలాగే ఆయన జీవితంలోని ఎన్నో కోణాలను చూపించబోతున్నాం. ఇలాంటి సినిమాకి డైలాగ్స్ చాలా సహజంగా ఉండాలి. ఈ విషయంలో డైలాగ్ రైటర్ అబ్బూరి రవిగారు బ్యాక్ బోన్‌గా నిలిచారు. వైజాగ్‌లో సినిమా చూస్తూ డైలాగ్స్‌కి ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. ఆ రియాక్షన్ రేపు అన్ని చోట్ల ఉంటుందనుకుంటున్నా. సందీప్ ఉన్నికష్ణన్ ఫ్యామిలీ నిన్ననే బెంగుళూరులో సినిమా చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. మేజర్ రియాక్షన్ ఫలానా సన్నివేశంలో ఎలా ఉంటుందో అని అడిగి మరీ షూటింగ్ చేశాం. వాళ్ళ అమ్మగారు పలు సూచనలు చేసేవారు. ఈ సినిమాని చూసి వాళ్ళ ఫ్యామిలీ అంతా మెచ్చుకున్నారు. ట్రైలర్ రిలీజ్ ముందు రోజు మహేష్‌బాబు సినిమా చూశారు. 5 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. బాగుందో లేదో అనే అనుమానం వచ్చింది. కానీ వెంటనే శేష్‌ను హగ్ చేసుకుని, అభినందించారు. ఇందులో శేష్ తల్లిదండ్రులుగా రేవతి, ప్రకాష్‌రాజ్ అద్భుతంగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో వీరిద్దరి నటన కన్నీళ్ళు తెప్పిస్తాయి. సయిమంజ్రేకర్, శోభితా పాత్రలు బాగుంటాయి.'మేజర్'లాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. నెక్ట్స్ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఉంటుంది' అని చెప్పారు.