Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విక్రమ్' సినిమాలో గ్రేట్ మ్యాజిక్ ఉంది. హీరో నితిన్, వాళ్ళ నాన్న సుధాకర్ రెడ్డి సొంత బ్యానరైన శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400కిపైగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేయడం ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు' అని కమల్ హాసన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్‌తో పాటు విజరు సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో
కమల్ హాసన్ ముచ్చటించారు.
ఈ సినిమా ట్రైలర్లో అడవిలో వేట అన్నట్టుగా చూపించటానికి కారణం ఒకటే..
ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే, ఇది కూడా అడవే. క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా భాగస్వాములుగా ఉన్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. ఈ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూడ బోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు ఉంటాయి. ఇదొక డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. ప్రేక్షులకు గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజారు చేయండి.అయితే ఇందులో 'విక్రమ్' ఎవరనేది ఇప్పుడు నేను చెబితే, ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ పోతుంది. 'విక్రమ్' ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (నవ్వుతూ)
ఇందులో విజరు సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్లు కూడా ఉన్నారు. వాళ్ళ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే హీరో సూర్య స్పెషల్ అపియరెన్స్‌లో కనిపిస్తారు. అయితే సూర్యతో ఎప్పట్నుంచో ఫుల్‌లెంగ్త్ సినిమా చేద్దామని అనుకుంటున్నాం. దీని కోసం దాదాపు ఐదుగురు దర్శకులతో చర్చలు నడుస్తున్నాయి. మహేశ్ నారాయణ్‌తో మా బ్యానర్లో నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. మలయాళంలో 'మాలిక్' లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించారాయన. మహేశ్ నారాయణ్ గతంలో 'విశ్వరూపం'కు ఎడిటర్‌గా కూడా పని చేశారు. తెలుగు స్ట్రయిట్ సినిమా చేయాలని నాకూ ఉంది. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే అదిరిపోయే సినిమా చేస్తా.
'భారతీయుడు 2' చిత్రానికి మీరే దర్శకత్వం చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. నా నుండి ప్రేక్షకులు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇది సాధ్యపడదు. అందుకే దర్శకత్వం వేరే వాళ్లకు అప్పగించి, నటనపై దృష్టిపెట్టాలని భావిస్తున్నా.