Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారి అలా కాదు.. మేమే 'అంటే సుందరానికీ' లాంటి బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం' అని యువ కథానాయకుడు నాని అన్నారు.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ'.
ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై.రవి శంకర్‌తో పాటు చిత్ర బందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, 'వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్‌కి అల్లుడు వచ్చాడు.(నవ్వుతూ) అల్లుడు వచ్చినపుడు అల్లుడికి విందుభోజనం పెడతారు కదా.. కానీ ఈనెల 10న అల్లుడే విందు భోజనం పెడతాడు. ఎందుకంటే ఈసారి మేం బ్లాక్ బస్టర్ సినిమా తీశాం. ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యూమర్, ఎమోషన్ కారణం. ఈ ఏడాది యాక్షన్ కావలసినంత దొరికింది. హ్యూమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కావాల్సినంత హ్యూమర్, ఎమోషన్ దొరుకుతుంది. ఈ సినిమా చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ప్రతి సీన్ ఎంజారు చేస్తారు. వైజాగ్ సముద్రం మాదిరిగానే హ్యూమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్‌లో నాకు ఇది రెండో సినిమా. కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. నజ్రియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లీలా పాత్రలో తనని తప్ప ఎవరినీ ఊహించుకోలేరు. మీ అందరితో కలిసి ఎప్పుడు సినిమా చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. జూన్ 10న అరిచి అరిచి, నవ్వి నవ్వి మీ చొక్కాలు తడిచిపోవాలి' అని చెప్పారు.
''అంటే సుందరానికీ'తో మొదటి తెలుగు సినిమా చేయడం, తెలుగులో డబ్బింగ్ చెప్పడం, ఇప్పుడు వైజాగ్ రావడం ఈ మూడు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ లేకుంటే ఇంత గొప్ప ప్రయాణం జరిగేది కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ గారితో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి' అని హీరోయిన్ నజ్రియా అన్నారు.
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో నానిగారు తన నటనతో విశ్వరూపం చూపిస్తారు. నాని, నజ్రియా, నరేష్, నదియా ఇలా అందరి ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని నవ్వించి, మెప్పిస్తారని నమ్ముతున్నాను' అని తెలిపారు.