Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. ఈనెల 23న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రెండో థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ 'ట్రైలర్ నుంచి బేసిక్ పాయింట్ అర్థమై ఉంటుంది. మురళి, సురేఖ క్యారెక్టర్లు నాకు స్పెషల్గా అనిపించాయి. అంతకు ముందు అటువంటి పాత్రల గురించి వినలేదు, చదవలేదు, చూడలేదు. వాళ్ళ గురించి తెలిశాక... సినిమా తీయాలని రీసెర్చ్ చేశా. కొండా ఫ్యామిలీని కలిశా. సినిమా తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. నా తల్లిదండ్రుల కథ కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తానని కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ చెప్పారు' అని అన్నారు.
'మా తల్లిదండ్రుల కథ అందరికీ తెలియాలని అనుకున్నాను. అమ్మానాన్న ఇద్దరూ స్టూడెంట్ లీడర్లుగా స్టార్ట్ అయ్యారు. తర్వాత రాడికల్ నేపథ్యం వైపు ఆకర్షితులు అయ్యారు. రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎదగాలని నాన్న చాలా తాపత్రయపడ్డారు. కొండా మురళి, కొండా సురేఖ ప్రస్థానం అంత ఈజీ కాదు. చాలా ఒడిదుడుకులతో, పెత్తందార్ల చేతుల్లో నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయారు. బంతి ఎంత కిందకు కొడితే, అంత పైకి వస్తుందన్న రీతిలో.... సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నేతగా ఎదిగారు. ఇవన్నీ జనాలకు తెలియాలి' అని నిర్మాత కొండా సుష్మితా పటేల్ చెప్పారు. త్రిగుణ్ మాట్లాడుతూ, ''కొండా మురళిగారి పాత్రలో... నేను ఇలా కనిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదు' అని అన్నారు. 'సురేఖ గారి పాత్రలో నేను నటించగలనని నమ్మిన రామ్ గోపాల్ వర్మ గారికి, కొండా ఫ్యామిలీ సభ్యులకు థ్యాంక్స్. మంచి సినిమా తీశాం' అని నాయిక ఇర్రా మోర్ అన్నారు.