Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై ప్రణవ చంద్ర, మాళవిక జంటగా రూపొందుతున్న చిత్రం 'దోచేవారెవరురా..'. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. గాన గంధర్వుడు ఎస్.పి.బాలు జయంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర బృందం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
ఇందులో భాగంగా ఈ చిత్రంలోని 'సూళ్ళే బాకు..' అంటూ సాగే రెండో లిరికల్ వీడియో సాంగ్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన రచయిత, నటుడు తనికెళ్ళభరణి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'బాలుగారి జయంతి నేపథ్యంలో దర్శకుడు శివానాగేశ్వరరావు రాసిన లిరికల్ వీడియోను విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం' అని అన్నారు. 'సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని చూసేలా రూపొందించాం. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం' అని దర్శకుడు శివనాగేశ్వరరావు చెప్పారు.