Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలై, భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయి అని ప్రేక్షకులు, విమర్శకులు కితాబిచ్చారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో 'ఇండియా లవ్స్ మేజర్' అంటూ చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ,'ఎమోషనల్‌గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే 'మేజర్' ఐదు రెట్లు పెద్దది. మేజర్ సందీప్ విషయానికి వస్తే, ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన ఉంది. అయతే 'మేజర'్ని నేను సినిమాగా చూడటం లేదు ఇది ఎమోషన్. ఈ సినిమా చూసి చాలా మంది ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై ప్రామిస్ చేస్తున్నా. సిడిఎస్, ఎన్డీఏలో జాయిన్ అవ్వాలనుకుని, సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మా 'మేజర్' టీమ్ నిర్ణయించింది. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ పేరుతో ఈ మూమెంట్‌ని లాంచ్ చేస్తాం. 'మేజర్' చిత్రాన్ని మా పేరెంట్స్‌కి డెడికేట్ చేస్తున్నా' అని చెప్పారు. 'అడవి శేష్‌కి స్పెషల్ థ్యాంక్స్. 'మేజర్'లాంటి గొప్ప సినిమా చేసే అవకాశం ఇచ్చారు. రచయిత అబ్బూరి రవి గారి సపోర్ట్‌ని మర్చిపోలేం' అని దర్శకుడు శశి కిరణ్ తిక్క అన్నారు. నిర్మాతలు శరత్, అనురాగ్ మాట్లాడుతూ,'మేజర్' గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. సినిమా నచ్చితే బావుందని అంటారు. కానీ ఈ సినిమాకి అందరూ ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేని అనుభూతి. దర్శకుడు శశికి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయాం. 'మేజర్' లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు' అని తెలిపారు.