Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ'.
నజ్రియా తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్న ఈ చిత్రం ఈ నెల10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఈ సినిమా కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు. అన్ని రకాల ఎమోషన్స్‌ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎమోషనల్‌గా కూడా చాలా బలమైన కంటెంట్ ఉన్న కథ ఇది. ట్రైలర్ చూసిన తర్వాత భారతీరాజాగారి 'సీతాకోక చిలుక' మీ సినిమాకి ప్రేరణగా తీసుకున్నారా అని చాలా మంది అడిగారు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయితే నాని లుక్‌కి మాత్రం 'బారిష్టర్ పార్వతీశం' నవలను ప్రేరణగా తీసుకున్నాను. ఈ కథ విని నాని గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. కథలో నిజాయితీ, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ ఉండవు. హీరో, హీరోయిన్ల నేపథ్యాలను హిందూ, క్రిస్టియన్‌గా చూపించాం. అయితే ఒక సంప్రదాయ వాద సమాజం నుండి బయటికి రావాలనే సందేశంలాంటిది ఇందులో ఉండదు. కానీ మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఉంటుంది. అది కూడా అది క్లాసులు పీకినట్లు ఉండదు. పాత్రల నుండే సహజంగా వస్తుంది. ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు అవును కరక్టే కదా అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. టీజర్, ట్రైలర్లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. ఇంకా చాలా సస్పెన్స్ ఉంది. ట్రైలర్లో ఎమోషన్, ఫన్ చూపించాం. ట్రైలర్ చివర్లో నవ్వుకున్నారు. ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది కదా.. సినిమా అంతా కూడా ఇంతే ఆసక్తికరంగా ఉంటుంది. నాని, నజ్రియాలు అందర్నీ మెస్మరైజ్ చేస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పని చేయడం గొప్ప అనుభూతినిచ్చింది' అని వివేక్ ఆత్రేయ తెలిపారు.