Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'.అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ, 'టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు, నేను మొదటి వరుసలో ఉంటాం. నైజంలో రూ.160, ఆంధ్ర మల్టిఫ్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్‌లో రూ.100గా టికెట్ థరలు నిర్ణయించాం. అందరూ టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు' అని చెప్పారు. 'తెలుగులో నా సినిమా రిలీజై చాలా రోజులైంది. మారుతి గారు ఏంజిల్ ఆర్నా కంటే చాలా చాలా మంచి పాత్ర రాశారు. సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఆడియెన్స్ బాగా ఎంజారు చేస్తారు. గోపీచంద్ గారితో మూడు సినిమాలకి వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది' అని నాయిక రాశిఖన్నా అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ,'ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మొదటి కారణం యు.వి క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటితో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఉంటుందని హామీ ఇస్తున్నాను' అని తెలిపారు. 'ఈ సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు. ఎఫ్ 3 సిినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుంది. అలాగే టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉంటాయి' అని అల్లు అరవింద్ చెప్పారు. 'నేను ఈ సినిమా చేయటానికి కారణం వంశీ. 'జిల్' తరువాత ఎప్పటినుంచో సినిమా చెయ్యాలనుకున్నాం. కానీ మంచి కథ దొరకలేదు. ఈ కథ బాగా నచ్చడంతో చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. మారుతితో జర్నీ స్ట్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెన్త్ బాగా కుదిరింది. పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు, దాని రిజల్ట్ కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్ సినిమా' అని హీరో గోపీచంద్ అన్నారు.