Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జేజీఎం'. బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా సినిమాగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే ఈ సినిమా హై వోల్టేజ్ ఎంటర్టైనర్గా ఉండనుంది.
పూరీ కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్లో ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిగా నటిస్తున్నారు. విజరు దేవరకొండతో పూజా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తొలి చిత్రమిది. ఈ చిత్ర మొదటి షెడ్యూల్‌ను శనివారం ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ ముంబైలో మొదలై, పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగనుంది. చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
'ఈ చిత్రంలో విజరు దేవరకొండను మునుపెన్నడూ చూడని పాత్రలో దర్శకుడు పూరీ చూపించబోతున్నారు. అలాగే పూజా హెగ్డే పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. తన సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలను పూరీ ఎలా చూపిస్తారో వేరే చెప్పక్కర్లేదు. ఆయన మార్క్ స్టయిల్‌తో ఇందులోనూ పాత్రలుంటాయి. పూరీ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్ 3న విడుదల చేయబోతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.