Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజన్ వివికే వి.విజయ్ కుమార్ టెలివిజన్‌కి సంబంధించి 24 క్రాఫ్ట్స్‌లోని నిరుపేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను ఉచితంగా అందిస్తున్న సందర్బంగా ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాంసతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి, జాయింట్ లేబర్ కమీషనర్ గంగాధర్, బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కష్ణ మోహన్, నటులు జాకీ, హరిత, ధనలక్ష్మి, కల్పన, సుష్మ, సింగర్స్, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్, వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాల పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, కె.వి.రమణాచారి గారి చేతుల మీదుగా అందజేశారు
ఈ సందర్బంగా విజన్ వివికే విజయ్ కుమార్ మాట్లాడుతూ,'టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న నిరుపేద కళాకారులు వారి కష్టాలు చెబుతుంటే నా మనసు చాలా చలించి పోయింది. అందుకే ప్రతి క్రాఫ్ట్ నుండి 5 మంది నిరుపేద కళాకారులను ఎంపిక చేసి, మొత్తంగా అన్ని క్రాప్ట్స్ కలిపి 101 మందికి ఉచితంగా ఇళ్ళ స్థలాలను అందించి, నా మాట నిలబెట్టుకున్నాను' అని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 'విజరు కుమార్ గొప్ప నిర్ణయం తీసుకోవడమే కాదు. టీవీ రంగానికి సంబంధించిన పేద కళాకారులను ఆదుకోవడం అభినందనీయం. సుమారు 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం' అని తెలిపారు.