Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్ర లిరికల్ వీడియో సాంగ్ విడుదలతోపాటు సినిమా విడుదల తేదీ ప్రకటన జరిగాయి. ఈ సందర్భంగా ఈ చిత్ర పోస్టర్‌ను బాబూమోహన్ ఆవిష్కరించగా, జూలై1న విడుదలచేస్తున్నట్లు చిత్ర హీరో సందీప్ మాధవ్ ప్రకటించారు. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు.
బాబూ మోహన్ మాట్లాడుతూ, 'ఈ చిత్ర కథలోని పాయింట్ కొత్తది. చెప్పడం వేరు, తీయడం వేరు. దాన్ని దర్శకుడు అప్సర్ బాగా డీల్ చేశాడు. ఈ సినిమా ఒక సరికొత్త ప్రయోగం. మంచి సందేశం కూడా ఉంది' అని తెలిపారు.
'ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతున్నాయి.ఇటీవల విడుదలైన 'మేజర్', 'విక్రమ్' దీనికి మంచి ఉదాహరణలు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. ఇండియన్ తెరపై ఇప్పటివరకు రాని పాయింట్. సందీప్ ఇందులో ఫైట్స్ బాగా చేశాడు' అని సాయికుమార్ అన్నారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ, 'ఇంతకుముందు కమర్షియల్ సినిమాలు చేశాను. ఇది ఫిక్షన్ పాయింట్. ఎందుకు, ఏమిటి? ఎలా జరుగుతుంది? అనే ఆసక్తికరమై కథతో నిర్మాత సబాని గారు కొత్త దర్శకుడు అప్సర్‌తో బడ్జెట్‌కు వెనుకాడకుండా నిర్మించారు. సాయికుమార్, బాబూమోహన్ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. ర్యాప్ రాక్ షకీల్ సంగీతాన్ని బాగా సమకూర్చాడు. దర్శకుడు అప్సర్ రాసుకున్న డైలాగ్స్, ఎమోషన్స్ బాగా పండాయి' అని చెప్పారు.
'ఈ కథను రెండు లైన్లలో చెప్పగానే ఓకే అన్నాను. శాండీ (సందీప్ మాధవ్) ఈ కథ నచ్చి చేశారు. నావెల్టీ కథ. అందరినీ ఇన్స్పైర్ చేసే సినిమా. ఇండిస్టీలో ఎవరికీ తెలియని అప్సర్ అందరికీ తెలిసేలా ఈ సినిమా తీశాడు' అని దర్శకుడు వీరశంకర్ తెలిపారు. ఎస్.కె. పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'సినిమా తొలికాపీ చూశాను. ఇందులో ఉన్న కొత్త పాయింట్ ఏ సినిమాలోనూ ఇప్పటివరకు రాలేదు. అందుకే ఈ సినిమాని విడుదల చేస్తున్నాను' అని అన్నారు.