Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తున్న లేటెస్ట్ సినిమా 'సింబా'.
అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌కు సంపత్‌నంది రచయిత కూడా. 'ది ఫారెస్ట్ మ్యాన్' అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో జగపతిబాబు ప్రకతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు.
అడవుల్లో నివసించే ఫారెస్ట్ మ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో సంపత్‌నంది చూపిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దష్టినీ ఆకర్షిస్తోంది. 'ప్రకతి తనయుడు ఇతడు... జగపతిబాబు గారిని 'సింబా'గా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాం' అని మేకర్స్ పేర్కొనటం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం : డి.కష్ణ సౌరభ్, సినిమాటోగ్రాఫర్ : కష్ణప్రసాద్.