Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎఫ్ 3' విడుదలై ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా దూసుకెళ్తోంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది' అని 'ఎఫ్3' చిత్ర బృందం తెలిపింది.
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. తొమ్మిది రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసి, హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతున్న సందర్భంగా చిత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ 'ఫన్'టాస్టిక్ ఈవెంట్‌ని వైజాగ్‌లో చిత్రయూనిట్ గ్రాండ్‌గా జరిపింది.
వెంకటేష్ మాట్లాడుతూ,'ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకి ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. వైజాగ్ అంటే నాకు చాలా స్పెషల్. నా మొదటి సినిమా 'కలియుగ పాండవులు' ఇక్కడే చేశాను. 'స్వర్ణ కమలం', 'గోపాల గోపాల', 'సీతమ్మ వాకిట్లో', 'మల్లీశ్వరి', 'గురు'.. ఇలా చాలా సినిమాలు ఇక్కడ చేశాను. ఇక్కడ 'ఎఫ్ 3' ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. మీరు గొప్ప విజయాన్ని అందించారు' అని తెలిపారు. 'ప్రేక్షకులు, అభిమానులందరికీ థ్యాంక్స్. 200 మంది ఆర్టిస్ట్‌లతో రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి రెండున్న గంటల పాటు మీరు ఆనందంగా ఉండాలని సినిమా తీసి, మీ ముందుకు తెచ్చాం. డబ్బులు, కలెక్షన్స్ ఇవ్వలేని తప్తి.. మీరు సినిమా చూశాక శభాష్ అంటే వస్తుంది. అదే మాకు వంద కోట్లు. ఈ సినిమాకి మీరు చూపిన ఆదరణే మాకు వంద కోట్లతో సమానం' అని వరుణ్ తేజ్ చెప్పారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ''ఎఫ్3' ఫ్రాంచైజీని కొనసాగించవచ్చనే ధైర్యాన్ని 'ఎఫ్ 3' విజయంతో ఇచ్చారు. ఈ సినిమాని నవ్వుకోవడాకే తీశామని మొదటి నుండి చెబుతూనే ఉన్నాం. ఈ రోజు ఆ నవ్వుల విలువ వందకోట్ల రుపాయిలతో ప్రేక్షకులు తిరిగిచ్చారు' అని అన్నారు. ''ఎఫ్ 3'ని ఆదరించి, ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు కుటుంబాలకు స్పెషల్ థ్యాంక్స్. మంచి సినిమాలు ఇస్తామని మా సంస్థపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ధన్యవాదాలు. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది' అని నిర్మాత దిల్ రాజు అన్నారు.