Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అంటే సుందరానికీ'లో నా కామెడీ టైమింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి టైమింగ్ ఉన్న పాత్ర చేయలేదు. దర్శకుడు వివేక్ నా పాత్రని చాలా కొత్తగా రాసుకున్నాడు. ఈ సినిమా చాలా హిలేరియస్‌గా ఉంటుంది. కొత్త నానిని, కొత్త టైమింగ్ చూస్తారు' అని నాని చెప్పారు.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ'. నజ్రియా తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్న ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హీరో నాని సోమవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
సుందర్.. అనుకున్నంత అమాయకుడు కాదు
ఇందులో బ్రాహ్మణ కుర్రాడు సుందర్ అమాయకత్వం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అయితే సుందర్ ట్రైలర్, టీజర్లో కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. దర్శకుడు వివేక్ అదే పాయింట్ ముందు చెప్పి, 'సుందర్ చాలా వరస్ట్ ఫెలో సర్. కానీ ప్రతి ఫ్రేమ్‌లో వీడిని ప్రేమించాలి', ఇదే సుందర్‌లో ఉండే మ్యాజిక్. సుందర్ వరస్ట్ యాంగిల్ అంతా అమాయకత్వంలో బయటికి వస్తుంది. సుందర్ ఇన్నోసెంట్ కన్నింగ్ ఫెలో. (నవ్వుతూ).
అద్భుతమైన ప్రయాణం
ఇందులో లీలా పాత్రకి నజ్రియా 100% న్యాయం చేసింది. నజ్రియా, నరేష్‌గారు.. వీరితో నటించడం, దర్శకుడు వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్‌తో పని చేయడం అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా నిర్మాతలు నవీన్, రవిగారు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాతలు. 'గ్యాంగ్ లీడర్'తో మా జర్నీ మొదలైంది. ఆ సినిమా మాస్, క్లాస్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుంది. వివేక్ సాగర్ సినిమా కథకి ఒక ఆయుధం లాంటి సంగీత దర్శకుడు. ఒక కథని తన సంగీతంతో ఎంత ప్రభావవంతగా చెప్పాలో తెలిసిన సంగీత దర్శకుడు. పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా చేశాడు.
పవర్ఫుల్ రా సినిమా 'దసరా'
దసరా 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది. తెలుగులో వస్తున్న పవర్ ఫుల్ రా సినిమా ఇది. ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. మా ప్రొడక్షన్లో 'మీట్ క్యూట్' అనే సినిమా చేస్తున్నాం. డైరెక్ట్ డిజిటల్లో రిలీజ్ చేస్తాం. అలాగే 'హిట్ 2' సినిమా భారీగా ఉంటుంది. 'మేజర్' తో అడవి శేష్ హిట్ కొట్టారు. 'హిట్ 2' కూడా ఏ మాత్రం తగ్గదు. ఈ ప్రాంచైజీ కొనసాగుతుంది.