Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సురాపానం'. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 10న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ మాట్లాడుతూ, 'మనిషికే కాదు దేవుళ్లకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేది సురాపానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఊహతో తెరకెక్కించిన సినిమా ఇది. ట్యాగ్ లైన్ పెట్టినట్లే కిక్ అండ్ ఫన్ ఇస్తుంది. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే కథా నేపథ్యంతో మంచి ప్రేమ కథను కూడా చూపించారు. సంపత్ కుమార్ హీరోగా నటిస్తూనే ఒక మంచి కథను అల్లి సినిమాను తెరకెక్కించాడు' అని తెలిపారు. 'ఈ సినిమాలో ఇప్పటిదాకా చూడని ఓ కొత్త కథను చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్ వంటి అన్ని అంశాలుంటాయి. ఈనెల 10న సినిమాని చూసి ఆదరించండి' అని హీరో, దర్శకుడు సంపత్ కుమార్ చెప్పారు. హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమా కంటెంట్ చూశాక తెలుగు అమ్మాయి అని పిలుస్తున్నారు సినిమా విజయం మీద చాలా నమ్మకం ఉంది' అని అన్నారు.