Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పధ్వీ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం 'కిరోసిన్'.
ఈ సినిమాకు ధవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు.
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈనెల 17న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ప్రజెంట్ ట్రెండ్‌లో ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలోనే తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది' అని చెప్పారు.
'రెండు నిమిషాల 14 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్లో చూపించిన ప్రతి సన్నివేశం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలను జోడించి ఈ సినిమాను దర్శకుడు ధృవ అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రానికి ధృవ ఎంత బాగా డైరెక్ట్ చేశారో, అదే స్థాయిలో ఆయన స్క్రీన్‌ప్లే, మాటలను కూడా అందించడం విశేషం. ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం. ఈనెల 17న విడుదలవుతున్న ఈసినిమా ఫలితంపై మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రొడ్యూసర్స్ పధ్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషించారు.