Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'అనుకోని ప్రయాణం'. ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో డా.జగన్ మోహన్ డి.వై నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'నలభై ఏళ్ళ సినీ ప్రయాణంలో 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' లాంటి కొన్ని కథలు విన్నప్పుడు షాకైనమాటే వాస్తవమే. కానీ దర్శకుడు వెంకటేష్ 'అనుకోని ప్రయాణం' కథ చెప్పినపుడు ఫ్రీజ్ అయ్యాను. 45 ఏళ్ళ తర్వాత మళ్ళీ గొప్ప సినిమా చేస్తున్నాననే భావన కలిగింది. కరోనా సమయంలో వలస కూలీల ప్రయాణం నుండి పుట్టిన కథ ఇది. ప్రేక్షకుల మనసుని ఆకట్టుకునే గొప్ప కథ. ఇందులో ఇద్దరి స్నేహితుల గొప్ప స్నేహాన్ని చూస్తారు. నరసింహరాజుగారు లాంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.
'ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసినప్పుడు ప్రతి సీన్ నవ్వుకున్నాను. ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. నిర్మాతలు చాలా గొప్ప కథతో వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కథ ఒప్పుకున్నారంటేనే విజయం కింద లెక్క. ఇలాంటి విజయవంతమైన చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది' అని నరసింహరాజు చెప్పారు.
దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ, 'డా.జగన్ మోహన్ గారి లాంటి నిర్మాత దొరకడం నా అదష్టం. ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథని కూడా అందించారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు గొప్ప నటులతో ఈ సినిమా చేయటం గర్వంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని తెలిపారు.