Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై, భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, '2008లో 26/11 ఎటాక్ జరిగిన టైంలో మేం ఇద్దరం ఇంజనీరింగ్ చేస్తున్నాం. కాలేజీ టూర్లో భాగంగా ఢిల్లీ వెళుతున్నాం. ఈ ట్రైన్లో కొందరు జవాన్లు ఎక్కారు. వారితో మాటలు కలిపాం. వారు చెబుతున్న కథలు, రియల్ సంఘటనలు విన్నాక అవి మైండ్‌లో అలా నిలిచిపోయాయి. సేమ్ ఇదే టాపిక్‌తో శేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'మేజర్' చేద్దామనుకున్నాడు. ఆయన చెప్పిన కథ విని ఈ సినిమాని నమత్ర, సోనీవాళ్ళతో కలిసి తీశాం. ఈ సినిమా విడుదలయ్యాక, అందరూ దీని గురించి గొప్పగా మాట్లాడుకోవడంతో ఓ గౌరవ ప్రదమైన సినిమా చేశామనే సంతోషం కలిసింది. దేశమంతా మంచి పేరు వచ్చింది. చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చూశాక మేము ఆర్మీలో జాయిన్ అవుతామంటూ యూత్ నుంచి వందకుపైగా ట్వీట్లు, మెసేజ్‌లు వచ్చాయి. మేజర్ సందీప్ తల్లిదండ్రులకు జీవితాంతం గుర్తిండిపోయే సినిమా ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా నిర్మాణ సంస్థలో సుహాస్‌తో 'రైౖటర్ పద్మభూషణ్', 'మేం ఫేమన్' అనే సినిమా. ఇందులో సుమంత్ ప్రభాస్ అనే యూట్యూబ్ ఫేమస్ కుర్రాడు లీడ్‌రోల్ చేశాడు. అలాగే తొట్టెం పూడి వేణు లీడ్రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో మరో సినిమా చేస్తున్నాం' అని తెలిపారు.