Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ'.
నాయిక నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ సినిమా ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నజ్రియా మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నారని అందరూ అంటున్నారు. అయితే నేను ఏదీ ప్లాన్ చేసుకోనండి. కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్‌గా ఉంటాను. 'అంటే సుందరానికీ' కథ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. ఈ కథని ఓ ప్రేక్షకురాలిగా విన్నాను. కథ అద్భుతంగా అనిపించింది.
ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ .. ఇలా అన్ని భావోద్వేగాలు ఒక కథలోనే కుదరడం చాలా అరుదు. 'అంటే సుందరానికీ' అంత అరుదైన కథ.
ఇందులో నేను లీలా థామస్ పాత్రలో నటించాను. ఈ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. లోపల బాధ ఉన్నా అది బయటికి కనిపించ నీయకూడదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. లీలా థామస్‌కి నిజ జీవితంలోని నజ్రియాకి ఒక్క పోలిక కూడా ఉండదు (నవ్వుతూ). నాని గ్రేట్ కోస్టార్. నరేష్, నదియాగారితో పని చేయడం కూడా గొప్ప అనుభవం. వారి నుండి చాలా నేర్చుకున్నా. వివేక్ చాలా నిజాయితీ గల దర్శకుడు. ఇకపై ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఓపెన్ డేట్స్ ఇచ్చేస్తా. ఆయన రైటింగ్ అద్భుతం. వివేక్‌తో మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నా. తెలుగులో నటించడం సవాల్‌గా అనిపించింది. సెట్‌కి వెళ్ళే ముందే స్క్రిప్ట్ మొత్తం తెలుగులో నేర్చుకున్నా. దీంతో తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పటానికి బాగా ఉపయోగపడింది. ఓ నటిగా నాకు చాలా స్వార్ధం ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా అందరితో నటించాలని ఉంటుంది. సత్యదేవ్ నటన అంటే కూడా ఇష్టం. అందరూ అద్భుతమైన నటులు. అందరికీ యూనిక్ స్టయిల్ ఉంది' అని నజ్రియా చెప్పారు.